27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఇరాన్ నుంచి అమెరికాకు ‘భారీ బహుమతి’.. అణ్వాయుధాలపై కీలక ఒప్పందం?

26-03-2026 01:55 AM

హోర్ముజ్‌కు సంబంధించి భారీ బహుమతి లభించింది

  1. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించింది
  2. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, మార్చి 25: ఇరాన్ నుంచి మాకు పెద్ద బహుమతి అందిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగించే విషయంపై అమెరికా- ఇరాన్ మధ్య చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ నుంచి తమకు చాలా పెద్ద బహుమతి లభించిందన్నారు. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారుచేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించిందన్నారు.

మంగళవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న వారు (ఇరాన్) ఒక అద్భుతమైన పనిచేశారు. మాకు ఒక బహుమతి ఇచ్చారు. ఈరోజే అది మాకు చేరింది. అది చాలా పెద్దది. దాని విలువ అపారమైనది’ అని ట్రంప్ పేర్కొన్నారు. అది అణు సంబంధమైనది కాదని.. చమురు, గ్యాస్‌తో ముడిపడినదని చెప్పాపరు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

అయితే, ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గురించే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆ దేశంలోని సరైన వ్యక్తులతోనే తాము చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.

ఇకపై జరగనున్న చర్చల్లో అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగమంత్రి మార్కో రూబియోతో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అణ్వాయుధం ఎప్పటికీ తయారుచేయమని ఇరాన్ అంగీకరించిందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.