26 March, 2026 | 3:36 AM

శత్రువులు పశ్చాత్తాప పడాల్సిందే!

26-03-2026 01:53 AM
  1. అప్పటి వరకూ దాడులు ఆగవు
  2. చైనాతో ఫోన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ

టెహ్రాన్, మార్చి 23: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా ముందడుగు వేస్తున్న తరుణంలో ఇరాన్ తిరస్కరణ ధోరణి అవలంబిస్తోంది. శత్రు దేశాలు పశ్చాత్తాప పడే వరకూ తాము యుద్ధం చేస్తామని  వెల్లడించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌ేొఅమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరుగు తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటికీ.. ఇరాన్ నుంచి వస్తో న్న సందేశాలు మాత్రం ధిక్కార ధోరణిని కనబరుస్తున్నాయి.

ఆ రెండు దేశాలు చేసిన దురాక్రమణకు.. వారు పశ్చాత్తాప పడే వర కూ తమ దాడులు కొనసాగిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చిచెప్పారు. తమ మిత్ర దేశం చైనాతో ఫోన్ సం భాషణలో భాగంగా అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా శత్రు దేశా లు దాడులు చేయడంతోనే టెహ్రాన్‌లో అస్థిరత చోటుచేసుకుందని అరాగ్చీ తెలిపారు. ‘మా లక్ష్యాలన్నీ నెరవేరడం సహా హింసాత్మక దురాక్రమణకు పాల్పడిన శత్రు దేశాలు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు జరుగుతాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడమే మా మొదటి ప్రాధాన్యం’ అని ఆయన చెప్పారు.