calender_icon.png 5 July, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట

05-07-2025 12:09:14 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

వావిలాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన 

పటాన్ చెరు/జిన్నారం, జులై 4 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోల్ టెక్ కంపెనీ సహకారంతో బాలవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు అత్యధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బాల వికాస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డి, గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఇన్చార్జి ఎంఈఓ కుమారస్వామి, వావిలాల మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం

మత సామరస్యానికి, త్యాగనిరతికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అఫ్జల్, వెంకటేష్, షకీల్, ఇమ్రాన్ పాల్గొన్నారు.