calender_icon.png 5 July, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటం

05-07-2025 12:08:21 AM

కుభీర్,(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, వృద్ధులకు రూ.6 వేలు, 4 వేలు పెంచి పింఛన్లు అందజేస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మల్లేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం కుబీర్ లో ఈనెల 7న మందకృష్ణ మాదిగ స్థాపించిన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరణ పై సన్నాక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినా ఆవిడ అన్నింటిని అమలు చేసి అప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ప్రజల తరఫున మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు రాష్ట్ర నాయకులు తుకారాం, నందకుమార్, జీ. కాశీనాథ్, మాజీ సర్పంచ్ గోరేఖర్ బాబు, కుబీర్ మండల ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు