calender_icon.png 5 July, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతలో సరుకుల్లా ఇంజినీరింగ్ సీట్లు

05-07-2025 12:09:25 AM

  1. ప్రైవేట్ కాలేజీలో విద్యా వ్యాపారాన్ని ఆపకపోతే ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తాం

బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీ లో విద్యా వ్యాపారాన్ని ఆపకపోతే ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తా మని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ హెచ్చరించారు. సంతలో సర్కుల ఇంజనీరింగ్ అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకుకు గురువారం దోమలగూడలోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య కౌన్సిలింగ్ నడుస్తున్న తరుణంలో మెరిట్ విద్యార్థులకు ఇవ్వాల్సిన బి కేటగిరి సీట్లను ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మినిమం ఎంసెట్ కూడా క్వాలిఫై గాని వారికి లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటూ అమ్ముకుంటున్న వైన్యం విద్యా వ్యాపారం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందరిని ద్రాక్షగా మారుస్తున్నారని అన్నా రు. కార్పొరేట్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు బీ క్యాటగిరి నోటిఫికేషన్ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటన ఇచ్చి విద్యార్థులకు తెలిసే విధంగా ఇవ్వాలని, 

కానీ నామమాత్రపు పత్రికలు ఎవరు చూడకుండా దొంగ చాటు గా నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చి సీట్ల ను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిరాజు, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మ, బీసీ యువజన సంఘం సెక్రటరీ భాస్కర్ బీసీ నాయకులు పాల్గొన్నారు.