30 August, 2026 | 4:40 AM

ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ సస్పెన్షన్

30-08-2026 01:16 AM
  1. మైనర్ బాలికపై లైంగికదాడి?
  2. అర్ధరాత్రి వేటేసిన అధిష్ఠానం.. ఈ చర్యపై అనుమానాలెన్నో
  3. పార్టీ పరువుపోతుందనే చర్యలా?
  4. ఎంపీ ఓవైసీకి విషయం ముందే తెలుసా?
  5. ‘బేగ్’ అంశంపై ఓవైసీ మాట్లాడరెందుకు: నిలదీసిన ఎమ్మెల్యే రాజాసింగ్

మలక్‌పేట్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ పద వికి కూడా రాజీనామా సమర్పించాలని ఆ పార్టీ జాయింట్ సెక్రెటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ శుక్రవారం అర్ధరాత్రి ఆదేశించడం కలకలం రేపుతూ, అనుమానాలను రేకెత్తిస్తుంది.

హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అనుచిత ప్రవర్తన పట్ల సంచనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రహ్మత్ బేగ్ సస్పెన్షన్ వెనుక విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నారిపట్ల అసభ్యం గా ప్రవర్తించడం, స్థానికులు పట్టుకొని చితకబాదడం వంటి ఆరోపణలు సామాజిక మాధ్యమా ల ద్వారా ప్రచారం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

మీర్జాబేగ్ పార్టీ నుంచి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించడం వెనుక అసలు కారణాలను ఆ పార్టీ ప్ర కటించలేదు. కాగా అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ముందే విషయం తెలుసని అందుకే బేగ్‌ను ఉమ్రా పంపించారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఓవైసీకి కారణం చెప్పే దమ్ముందా: రాజాసింగ్..

అర్ధరాత్రి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను ఎం దుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రా జాసింగ్ శనివారం ఓ వీడియో రిలీజ్ చేశారు. భూకబ్జాలు, ఇళ్లను కబ్జా చేసుకున్నా గతంలో ముడుపులు ఓవైసీకి కూడా అందడంతోనే చర్య లు తీసుకోలేదని మైనార్టీ వర్గాల ప్రజలే చెబుతున్నారని అన్నారు.

లైంగికదాడి ఘటన బయట పడితే పార్టీ పరువుపోతుందనే సస్పెండ్ చేశా రా? అని నిలదీశారు. బాలికపై బేగ్ లైంగికదాడి కి పాల్పడ్డాడని, స్థానికులు ఎమ్మెల్సీని చితకబాదారని, అందుకు సం బంధించిన వీడియో లు కూడా ఉన్నాయని పాతబస్తీ మైనార్టీ ప్రజ లే చెబుతున్నారని, ఇది నిజమా అని ప్ర శ్నిస్తున్నారని, మీడి యా కూడా ఈ అంశంపై కోడై కూస్తున్నా ఓవైసీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

బేగ్ సస్పెండ్ విషయంలో అసలేం జరిగిందో ఓవైసీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ అంశం లో దారుస్సలాంలో మీడియాతో మాట్లాడే అధినేత బేగ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడే దమ్ముందా? అని రాజాసింగ్ నిలదీశారు. 

ఆధారాలున్నాయి: బీఆర్‌ఎస్ సల్మాన్‌ఖాన్..

ఎంఐఎం అధినేత ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ వ్యవహారంలో మరో ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్ సై తం ఉన్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.