27 April, 2026 | 4:08 AM

ఏకలవ్య మోడల్ స్కూల్ లో సీటు సాధించిన బ్రిలియంట్ విద్యార్థి

27-04-2026 02:36 AM

బూర్గంపాడు, ఏప్రిల్26, (విజయక్రాంతి): ఆదివారం ప్రకటించిన ఏకలవ్య మోడల్ స్కూల్ ఫలితాల్లో సారపాక బ్రిలియంట్ స్కూల్ విద్యార్థి బి.నందిత యస్విని సీటు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్‌ఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిలియంట్ స్కూల్ మరియు కోచింగ్ సెంటర్ నుండి ఎందరో విద్యార్థులు ఏకలవ్య, నవోదయ, సైనిక్, గురుకులం పాఠశాలలో సీట్లు సాధించడం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రెండవ లిస్ట్ లో కూడా నవోదయలో సీట్లు సాధిస్తామనే ఆశాభావాన్ని తెలిపారు. నందిత సీటు సాధించడం పట్ల తోటి విద్యార్థులు,ఉపాధ్యాయులు అభినందనలు తెలీయజేశారు.