13 May, 2026 | 4:46 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

రైతు దారుణ హత్య

09-11-2024 12:00 AM

నాగర్‌కర్నూల్/ కల్వకుర్తి, నవంబర్ 8 (విజయక్రాంతి): రైతు హత్యకు గురైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఎంజీకాలనీ తండాలో చోటుచేసుకుంది. ఎంజీకాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30), హిమబిందు ఆరునెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. రాజుతో పాటు అతడి ఇద్దరు సోదరులు ఒకే దగ్గర ఉన్న వారి వ్యవసాయ పొలంలో వేరుశనగ సాగుచేశారు. వీరంతా అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోడం కోసం నిత్యం పంట పొలంలోనే కాపాలాగా ఉంటూ అక్కడే నిద్రిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి బోరు మోటార్ ఆన్‌చేయడానికి వెళ్లిన రాజు హత్యకు గురయ్యాడు. సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బండరాతితో తలపై మోది హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.