calender_icon.png 18 December, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వతంత్ర సర్పంచులకు బంపర్ ఆఫర్

17-12-2025 12:33:39 AM

  1. పార్టీ కండువా వేసుకుంటే ఎన్నికల ఖర్చు 
  2. భవిష్యత్తు ఎన్నికల కోసం పార్టీల ప్రణాళిక
  3. నిర్మల్ జిల్లాలో ఆధిపత్యం కోసం నేతల పాట్లు

నిర్మల్, డిసెంబర్ 1౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఫలితాలు భిన్నంగా ఉండడంతో పైచే సాధించేం దుకు స్వతంత్ర సర్పంచులపై పార్టీలు గాలంవిస్తున్నాయి.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన వారు తమ పార్టీ కండువా కప్పుకుంటే ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియ డంతో త్వరలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలంటే నిర్మల్ జిల్లాలో కొత్తగా గెలుపొందిన గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర కీలకంగా ఉండ బోతుందని భావిస్తున్న.

పార్టీ నేతలు కొత్తగా ఎన్నికైన స్వతంత్ర సర్పంచులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు నిర్మల్ జిల్లాలో మొత్తం 400 పంచాయతీలు ఉండగా ఇప్పటికే 267 గ్రామపంచాయతీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించగా బుధవారం మరో 127 గ్రామపంచా యతీ ఎన్నికలు మూగెనున్నాయి. జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గాలు ఉండగా ఖానాపూర్లోలో అధికార పార్టీ ఎమ్మె ల్యే డీసీసీ అధ్యక్షులు వేడుమ బొజ్జు పటేల్, నిర్మల్‌లో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ముధోల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాథమిథ్యం వహిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ రేఖా శ్యాం నాయక్ టిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి లోలం శ్యాంసుందర్ జాన్సన్ నాయక్ సర్పం చ్ ఎన్నికలు తమ మద్దతు ధరలు గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు

స్వతంత్ర అభ్యర్థులకు ఆఫర్

నిర్మల్ జిల్లాలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవ ర్గంలో ఒక్కొక్క విధంగా ఎన్నికల ఫలితాలు రాగా చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులే విజ యం సాధించారు. ఖానాపూర్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటీ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దారు లు ఎక్కువ గెలిచినప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ కూడా గణనీయమైన ఫలితాలను సాధించిం ది.

జిల్లాలో ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు అధికార కాంగ్రెస్ 118 సీట్లు, బిజెపి 78 బీఆర్‌ఎస్ మద్దతుదారులు 24 మంది సర్పంచులు గెలుపొందారు. మూడో విడుత కూడా ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఏర్ప డే అవకాశం ఉంది అయితే రెండు విడతల్లో స్వతంత్రులు 60 మందికిపైగా విజయం సాధించడంతో వారిని తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ బిజెపి నేతలు లాబింగ్ నిర్వహిస్తున్నారు.

స్వతంత్ర సర్పంచ్ గా గెలిచిన వారిలో రెబల్స్ అభ్యర్థుల ఎక్కువగా ఉండటంతో తిరిగి ఆ పార్టీ గూటికి చేర్చుకునేలా మండల స్థాయి నేతలతో ఎమ్మెల్యేలు మంత్రులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో స్థానికత అక్కడ సేవలు అభ్యర్థిత్వం ఎన్నికల హామీలు ఇతర ప్రలోభాల కారణంగా విజయం సాధించిన అభ్యర్థులు గ్రామపంచాయతీ జనాభాను బట్టి ఐదు లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చుపెట్టి విజయం సాధించగా స్వతంత్రులు గా గెలిచిన వారి సైతం 30 లక్షల వరకు ఖర్చుపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.

స్వతంత్రు లుగా గెలిచినవారు 70 వరకు ఉండడంతో వారు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి బలం పెరిగి వచ్చే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అని భావిస్తున్న ముఖ్య నేతలు వారిని పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇందుకుగాను ఎన్నికల్లో గెలుపు కోసం పెట్టుబడి పెట్టిన ఖర్చులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్, బిజెపి నేతలు పోటాపో టీగా స్వతంత్ర అభ్యర్థులకు ఫోన్లు చేసి పార్టీ కండువా కప్పుకోవాలని అందుకు ప్రతిఫలంగా తావిలాలను ప్రకటిస్తున్నారు.

ఎన్నికల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలుపొందామని ఆ ఖర్చు భరిస్తే పార్టీ కండువా కప్పుకుంటామని స్వతంత్ర అభ్యర్థులు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు అధికార పార్టీ మరోవైపు అధికార ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ కండువు కప్పు తీసుకుంటే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తక్షణ సహాయం కింద కొంత డబ్బులు ఆర్థిక సాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు ఏ పార్టీలో చేరాలో ఏ పార్టీలో చేరితే ఎంత ఆఫర్ వస్తుందోనన్న ఆశతో ఎదురు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

బుధవారం తృదిదశ ఎన్నికల సమరం పూర్తి కానుండడంతో జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన సర్పంచులను ఎక్కువ సం ఖ్యలో తమ పార్టీలోకి చేర్చుకునేలా కాంగ్రెస్ బిజెపిలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు కూడా ఎదుటి పార్టీల ఆఫర్లకు లొంగిపోకుండా కాపాడుకునేందుకు నియోజకవర్గ నేతలు వారిపై నిఘా వేసి ఉంచుతున్నారు.

పార్టీలోనే కొనసాగుతూ చివరి నిమిషంలో మద్దతు దక్కక రెబల్స్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్లను పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్థితి ఏం కావాలని గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన అభ్యర్థులు పార్టీ నేతలకు ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూలనడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలపై పడగా స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడవలసింది