calender_icon.png 17 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అభివృద్ధిపై దూరదృష్టి భేష్

17-12-2025 01:02:20 AM

సీఎం రేవంత్‌రెడ్డికి సోనియాగాంధీ అభినందన

2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచన

 హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని తీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిసి.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు.

డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రో జుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 వివరాలను సోనియాగాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో పాటు రెండేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను సైతం వివరించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరించగా ఇదే విధంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని సూచించారు.