19 August, 2026 | 10:25 PM

జీవో నెం.95 రద్దు చేయాలి

19-08-2026 09:38 PM

శక్తి స్కీము తీసివేయాలి  

టిఆర్పి, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జనగామలో భారీ రాస్తారోకో

జనగామ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి మరియు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు జనగామ పట్టణంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 95 ను వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న శక్తి స్కీము ను పూర్తిగా తీసివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్పి యూత్ జిల్లా అధ్యక్షులు పిట్టల సురేష్ మాట్లాడుతూ, GO 95 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. శక్తి స్కీము పేరుతో విద్యార్థులకు మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోలో పలువురు పాలిటెక్నిక్ విద్యార్థులు, టిఆర్పి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.