19 August, 2026 | 10:05 PM

నాచారగుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ

19-08-2026 09:27 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రం ‘స్వాతి’ని పురస్కరించుకొని బుధవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు కార్యనిర్వహణాధికారి బి. రంగాచారి ఆధ్వర్యంలో అర్చక స్వాముల మంత్రోచ్ఛరణలు, అశేష భక్తుల ‘నారసింహ’ నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని స్మరిస్తూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ పల్లెర్ల రవీందర్, మాజీ ధర్మకర్తలు ఉషా రాజశేఖర్ శర్మ, చందా నాగరాజు, గాలి కిష్టయ్య, కర్రె పద్మా వెంకటేష్, కొత్తపల్లి శ్రీనివాస్, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.