దివ్యాంగ విద్యార్థుల ఎక్స్‌పోజర్ టూర్
ఆర్మూర్,(విజయక్రాంతి): సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులను హైదరాబాద్‌లోని నెహ్రు జువలాజికల్ పార్క్‌కు ఎక్స్‌పోజర్ టూర్‌కు బుధవారం తీసుకెల్లారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్‌ల పరిధి నుంచి మూడు బస్సుల్లో విద్యార్థులను హైదరాబాద్‌కు తీసుకెల్లగా జిల్లా విద్యాధికారి అశోక్ జెండా ఊపి టూర్‌ను ప్రారంభించారు.
భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాగ విద్యార్థులకు బయటి ప్రపంచంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పర్యటనను రూపొందించారు. ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ముగ్గురు దివ్యాంగులను తల్లిదండ్రులు, ఐఈర్పీలు, స్పెషల్ టీచర్ల సహకారంతో పర్యటను పూర్తి చేసారు. పర్యటనలో ఐఈ జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్‌రావు, ఐఈఆర్పీలు, స్పెషల్ టీచర్లు లింబగిరి స్వామి, దమ్మి రాజన్న, నగేష్ గౌడ్, జలంధర్, కిషన్, విశ్వనాథ్ మహాజన్, ఆనంద్, లక్ష్మణ్, రాజశేఖర్, సంతోష్, చిరంజీవి, రవి, ప్రేమ స్వరూప, వసుంధర, రాధిక, రమ, శైలజ, మౌళిక తదితరులున్నారు.






