19 August, 2026 | 10:11 PM

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

19-08-2026 09:40 PM

బోధన్,(విజయ క్రాంతి): ఎడపల్లి మండలంలోని జైథాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 17/18వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. ఆలయంలోని సుమారు 5 గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి తొట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై జైథాపూర్ సర్పంచ్  ఎడపల్లి ఎస్ఐ రమా లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.