కులగణన జరపాల్సిందే
- బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే
- పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టాలి
- ఢిల్లీ మహా ధర్నాలో బీసీ నేతల డిమాండ్
- హాజరైన 16 మంది ఎంపీలు, 15 రాష్ట్రాల ఓబీసీ నేతలు
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మద్దతు
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో సమగ్ర కులగణన చేపడతామని గత సంవత్సరం ఏప్రిల్ 30న కేంద్ర క్యాబినెట్ నిర్ణ యం తీసుకున్నదని, రాబోయే ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న జనగణనలో బీసీ కులగణన జరిపాల్సిందేనని అఖిల భారత బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సం ఘ ఆధ్వర్యంలో బీసీ కుటుంబాలను లెక్కిం చి కులగణన ప్రారంభించాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున మహా ధర్నా చేపట్టారు. బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు దేశంలోని 16 మంది ఎంపీలు, ఎనిమిది రాజకీయ పార్టీలు, 15 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ.. రెండు దఫాలుగా జన గణనను చేపట్టనున్న ప్రభుత్వం అందులో ఎస్సీ, ఎస్టీ కు టుంబాలను లెక్కిస్తూ, బీసీ కుటుంబాలను లెక్కించడంతో కేంద్ర వైఖరిపై బీసీలకు అనుమానాలు ఉన్నాయన్నారు. బీసీల అనుమా నాలను నివృత్తి చేయడానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కులఘణనపై ప్రత్యేకంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేదంటే జాతీయస్థాయిలో జేఏసీని ఏర్పా టు చేసి దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి లక్షలాది మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కులగణనపై కేంద్రం రెండు నాలుకల ధోరణిపై పార్లమెంట్‌లో పోరాడుతామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలి పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలాగనే ఉంటే అన్ని పార్టీలు కలుపుకొని ఢిల్లీ కూటమి లక్షలాది మందితో ముట్టడించడానికి సిద్ధం కా వాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
ఎన్‌డీఏ కూటమిలో భాగస్వా మిగా ఉన్నప్పటికీ బీసీల విషయంలో రాజీ పడకుండా పోరాడుతామని, బీసీ సంఘాలు చేస్తున్న ధర్నా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని టీడీపీ ఎంపీలు అప్పలనాయు డు, అంబిక లక్ష్మీనారాయణ, నాగరాజు తెలిపారు. బీసీ కుటుంబాల లెక్కింపు తదనంత రం కులగణన లెక్కింపు తర్వాత జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీ య అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధ ర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, రావులకోల్ నరేష్ ప్రజాపతి, గొడుగు మహేష్ యాదవ్, ఈడి గ శ్రీనివాస్ గౌడ్, వల్లపు శివకుమార్, గూడూరు భాస్కర్ మీరు, ఉదయ్ నేత, సంధ్యారాణి, శివమ్మ, వల్లపు శివకుమార్, మడత వెంకట్ గౌడ్, సదానందం, జనగాం రవీందర్ గౌడ్, కొప్పుల చందు, కొత్త నరసింహస్వామి, డేగల శ్రీనివాస్, బోదాసు రవి, నాగరాజుగౌడ్, బండి గారిరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




