ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎందుకు మాట్లాడట్లేదు
హైదరాబాద్: ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహణ వల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయని, బాధ్యులపైన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యాశాఖలో రాష్ట్ర పరిధి అధికారాలను కేంద్రం లాక్కునే ప్రయత్నమని, యూనివర్సిటీలపై ఆధిపత్యం చలాయించాలని కేంద్రం యత్నిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. విద్య.. వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో ఉంటే తప్పిదాలు జరగకుండా ఉంటాయని, కేంద్ర చట్టాల మేరకు రాష్ట్రంలో ప్రక్షాళనపై యోచిస్తామన్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని, రాష్ట్రంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోందని, గ్లోబరీనా వంటి సంస్థలు నాడు తెలంగాణలో అక్రమాలకు పాల్పడ్డాయి. నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల సీబీఎస్ఈకి విస్తరించారని, గ్లోబరీనా వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర చట్టాల మేరకు రాష్ట్రంలో చట్టాలు రూపొందిస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలని చూసిన సంస్థలపై విచారణ జరుగుతోంది.
బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.8 వేల కోట్లు భారంగా మారిందని, అంతేకాకుండా మేము వాటిని ఇవ్వట్లేదనే భ్రమలు కల్పించే యత్నం చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, ఆర్.కృష్ణయ్య పదేపదే ప్రశ్నిస్తున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆర్.కృష్ణయ్య ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీలో బకాయిలపై ఎందుకు మాట్లాడట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, అక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మాట్లాడాలని, ఏపీలో చెల్లించాక తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు.






