28 July, 2026 | 5:13 PM

నూతన గ్రంథాలయం ప్రారంభం

28-07-2026 04:34 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని బేల మండల విద్యాధికారి (MEO) మహాలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నెల్లూరు పుస్తక మిత్ర వారు పాఠశాలకు రూ. 14,970 విలువైన పుస్తకాలను విరాళంగా అందజేయడం అభినందనీయమని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.