calender_icon.png 9 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌కే సవాల్..

14-10-2024 12:07:10 AM

అనంతిక సనీల్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఈ చిత్రం నుంచి ముద్దుగుమ్మ అనంతిక క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్ దసరా సందర్భంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మహేష్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక కనిపించనుంది. ట్రైనింగ్ సెంటర్‌లో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని సవాలు చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. సంతోషాలు, కన్నీళ్లు, విలువైన పాఠాలతో కూడిన ఓ యువతి ఎనిమిదేళ్ల ప్రయాణమే కథ.  విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.