14-10-2024 12:06:11 AM
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
దసరా సినిమా కంటే 100 రెట్లు విజయాన్ని నమోదు చేయాలనే టార్గెట్‌తో వస్తున్నట్టు ఇటీవల నాని తెలిపారు. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేయబోతున్నట్టు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు మేకర్స్ తెలిపారు.