7 April, 2026 | 8:21 AM

సంపులో పడి చిన్నారి మృతి

29-06-2024 01:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు సంపులో పడి రెండే ళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పరిధిలో చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు స్పోర్ట్స్ స్కూల్  పరిధిలోని నర్సరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి రెండేళ్ల కుమార్తె శుక్రవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్కూల్‌లోని సంపులో పడింది. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు చిన్నారి కోసం గాలించగా, సంపులో విగతజీవిగా చిన్నారి కనిపించింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలావిసేలా విలపించారు.