calender_icon.png 10 May, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలు మామను ఆదర్శంగా తీసుకోవాలి

10-05-2025 01:54:18 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

జుక్కల్, మే 9 (విజయ క్రాంతి) : ప్రస్తుతం కురుమ సమాజానికి కావలసిన విద్య పశువుల కాపరులుగా మారి దూరం చేసుకుంటున్నారని, అంతకుముందే చదువుకోకున్న గాని 15 గొర్లతో బాలు మామ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ చెడు గుణాలను వదిలి సన్మార్గంలో నడిచినప్పుడు మహాత్ములుగా తయారవుతారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కురుమ సమాజం నుంచి తాను ఒక్కడినే రాజకీయంలో ఉన్నానని అన్నారు. తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. ప్రజలు సన్మార్గంలో నడిస్తే పోలీస్ స్టేషన్లో అవసరమే ఉండదని ఒకవేళ అదే విధంగా జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో ప్రజలందరూ పోలీసుల దగ్గరికి రాకుండా ఉంటే ప్రభుత్వానికి తాను పోలీస్ స్టేషన్లో వద్దని సిఫార్సు చేస్తానని అన్నారు.

అందరూ మంచి ఉద్దేశంతో ఎవరికి ద్వేషించకుండా ఉంటే ఎలాంటి గొడవలు హింసత్మకమైన చర్యలు ఉండవని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్య, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులకు మంత్రి పదవులు దక్కుతాయని కురుమ సంఘం జిల్లా నాయకులు అన్నారు. కార్యక్రమం చివర్లో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్ర మాన్ని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతిని ధులు కాంగ్రెస్ నాయకులు సతీష్ పటేల్ శివానంద్, బీఆర్‌ఎస్  నాయకులు పాల్గొన్నారు.