calender_icon.png 10 May, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో స్పెషల్ డ్రైవ్

10-05-2025 01:55:43 AM

  1. 130 మొబైల్ ఫోన్ల రికవరీ 

ఎస్పీ  ఎం.రాజేష్ చంద్ర

కామారెడ్డి, మే 9 (విజయ క్రాంతి): సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరికి  గురైన 130  మొబైల్ ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా ( సుమారు  20   లక్షల విలువగల) సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. 

130 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అభినందించారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీసు కార్యా లయానికి వచ్చి RSI  బాలరాజును సంప్రదించి ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి బాధితులు సెల్ ఫోన్లు తీసుకోవాలని సూచించారు.