calender_icon.png 10 May, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ మహారాజ్ స్ఫూర్తితోనే పాకిస్థాన్‌పై దాడి

10-05-2025 01:52:44 AM

ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, మే 9 (విజయ క్రాంతి): ధైర్యానికి, సౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు, మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన గడ్డిపరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాలుపంచు కుంటుంది  అనడానికి నిదర్శం మహారాణ ప్రతాప్ గుర్రం చేతక్ దీనికి నిదర్శనం అన్నారు.

మహారాణా ప్రతాప్ జయంతి  సందర్బంగా స్థానిక ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సూర్యనారాయణ  హాజరు అయ్యారూ. అనంత రం ఆయన రాజా రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.