31 July, 2026 | 3:08 AM

అరుంధతి నగర్‌లో రూ.7లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

31-07-2026 01:56 AM

శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో రూ.7 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ హాజరై పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా సీసీ రోడ్డు కోసం ఎదురుచూస్తున్న అరుంధతి నగర్ బస్తీ ప్రజలకు త్వరలోనే మెరుగైన రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఎం. ఉమేష్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ప్రకాష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అరుణ్ కుమార్, అలాగే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు, బస్తీ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, సీహెచ్. రాజు, బి. ప్రకాష్, నవీన్తో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు.