17 June, 2026 | 8:39 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

రవాణా కార్మికులపై శీతకన్ను

04-12-2024 12:00 AM

గత కొన్నేళ్లుగా కార్మికుల సంక్షేమం తమ భాద్యతే కాదన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యవహరిస్తున్నాయి. ప్రజా సంక్షేమం ముందు అందరూ సమానులే. ముఖ్యం గా రహదారి, రవాణా రంగంలోని కార్మికుల యోగ క్షేమాలపట్ల ప్రభుత్వాలు నిర్లక్ష ధోరణి ప్రదర్శించడం భావ్యం కాదు. రవాణా వ్యవస్థ దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైంది. దేశంలోని అతిపెద్ద ఉపాధి కేంద్రాలలో ఇదొకటి. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సుమారు 50 వేలదాకా ఆటోలు ఉన్నాయి.

వీటిపై ఆధారపడిన యువత ప్రభుత్వం ఉపాధి చూపక పోయినా ఆటో లేదా ట్రాలీ లు నడపడం ద్వారా వచ్చే కాస్తంత ఆదాయంతోనే బతుకుబండిని లాగిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వాహనాల చట్టాలను అనుసరించి జరిమానాల ఛార్జీలు రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు మించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితులు కుదుటపడే వరకు అధికారులు అదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. 

లారీ యజమానులు, డ్రైవర్లు, లోడ్మెన్ సరుకులను నిర్వహించడంలో, రవాణా చేయడంలో విశేషమైన సేవలు అందిస్తున్నా రు. వారికి ప్రభుత్వం మౌలిక, కనీస సౌకర్యా లు కల్పించాలి. భద్రతా చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత వాహనాల యజమానులు, ప్రభుత్వంపైనా ఉంది.

ప్రైవేట్ డైవర్లకు ఎప్పటి కప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలూ ఉంటాయి. అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లకు మంచి ఆరోగ్య అలవాట్లు నేర్పాలి. రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం దేశ, రాష్ట్ర వ్యాప్త నిధిని ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు సత్వరమే పింఛను వచ్చేట్లు చట్టం తేవాలి. 

 డా. ముచ్చుకోట సురేష్‌బాబు