విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి
రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలి
కార్పోరేట్ విద్యాసంస్థలతో ఇంటర్ బోర్డు అధికారులు మిలాఖత్
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముందు ధర్నా
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ, కార్పొరేట్ విద్యాసంస్థలలో జరిగిన విద్యార్థుల ఆత్య హత్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఆ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి కార్యదర్శి టీ.నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కార్పోరేట్ విద్యాసంస్థలతో మిలాఖత్ అయ్యారని, దీనిపై విజిలెన్స్ దాడులు జరిపి ఇంటర్ అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇంటర్ అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదు.
రాష్ట్రంలో ఫీజులు వేధింపులు, ర్యాంకులు, మార్కులు కోసం తీవ్ర ఒత్తిడి కల్గించడం ఉదయం నుండి రాత్రి వరకు చదువులు, రివిజన్ పేరుతో ఒత్తిడి పెంచి మార్కెట్ మాయజాలం కోసం కోట్లు రూపాయలు ఫీజులను వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. వరుసగా తీవ్ర ఒత్తిడి, లెక్చరర్ వేధింపులు చేయడం చేస్తున్నారని అన్నారు. నారయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఇప్పటికే పదవ తరగతి పూర్తి కానీ విద్యార్థులను ఇప్పటికే రాయితీలు ఇచ్చి మరీ అడ్మిషన్లు చేస్తున్నారని ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ఈ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.
రెసిడెన్షియల్ పద్దతిలో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే హస్టల్స్ పెట్టి లక్షలాది రూపాయలు ఫీజులను వసూళ్లు చేస్తున్నారని ఈ ఫీజులపై తక్షణమే ఐటి దాడులు చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు దామెర కిరణ్, కె.అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, హైదరాబాద్ ఉపాధ్యాక్షురాలు చరణశ్రీ, శ్రీమాన్, నాగేందర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివ, స్టాలిన్, లిఖిత్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం విఘ్నేష్, మనోజ్, అరుణ్, లక్ష్మణ్, భగత్ తదితరులు పాల్గొన్నారు.




