1 April, 2026 | 5:08 PM

బాలల హక్కులు, చైల్డ్ హెల్ప్ లైన్, 1098 పైన అవగాహన సదస్సు

07-12-2024 05:16 PM

పెద్దపల్లి (విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలోనీ జిల్లా సమైక్య సమావేశంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో భాగంగా సోషల్ వర్కర్లు  శ్రీనివాస్, నిర్మల, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ మమత, చైల్డ్ హెల్ప్ లైన్, చైల్డ్ రైట్స్ పైన వారు అవగహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ద్వారా బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడిబాట పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, పారిపోయిన పిల్లలు, లైంగిక వేధింపులపైన బాలల హక్కుల పైన, పిల్లలపై ఆసభ్య ప్రవర్తన, ఓపెన్ టెన్త్, దత్తత తదితర విషయాలపైన అవగాహన కల్పించారు.

చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి ఆపదలో ఉన్నటువంటి పిల్లలకి సంబంధించిన చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్1098 కి కాల్ చేసి సమాచారం ఇవ్వలని, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 24 గంటలు, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని, చిన్నపిల్లలతో పనులను చేయించుకోవద్దని, మొబైల్స్ కి, సోషల్ మీడియా ఆప్స్ కి దూరంగా ఉండాలని తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కాల్ చేసి ఏదైనా సహాయం పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ రవికుమార్, డిపిఎంఎస్ రవి, తిరుపతి, నాగేశ్వరరావు, సతీష్, జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు, ఓబీలు, ఏపిఎం హెచ్డి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.