ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టాలి: ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 ,(విజయక్రాంతి): ప్రతి కేసులో సమక్ర దర్యాప్తు చేపట్టి నేరస్థులకు శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు అందరూ కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు శుక్రవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో ’క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.
కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ,కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ మరియు జిల్లాలోని సిఐలు,ఎస్త్స్రలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






