21-12-2025 12:42:59 PM
బెజ్జంకి: పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకిలో నివాసం ఉంటూ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు.
ఆదివారం తెల్లవారు జామున భార్యాభర్తలు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు,వారికి సుమారు 2 సంవత్సరాల చిన్న పాప వుంది. దంపతుల మృతితో దాచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు ఇంకా తెలియావల్సి ఉంది.