calender_icon.png 21 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదలు తొలగింపు

21-12-2025 12:56:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ గ్రామం నుండి లొంకలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముండ్ల పొదలను, చెట్లను తొలగించడం జరిగిందని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ...గోపాల్పేట్ గ్రామం నుండి లొంకలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ముండ్ల పొదలు,చెట్లు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు స్పష్టంగా కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఉద్దేశంతో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తొలగించడం జరిగిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను పొదలను తొలగించి అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతమని సూచించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.