calender_icon.png 21 December, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా కమిషనర్ గన్ మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

21-12-2025 12:39:56 PM

ఎల్బీనగర్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్ మెన్ ఆదివారం తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గన్ మెన్ ఆత్మహత్యతో తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య హయత్ నగర్ నివాసం ఉంటున్నాడు. తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణచైతన్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.