21-12-2025 01:14:59 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆదివారం జరుగుతుంది. నందిగామలో ఉన్న కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు ముందుగా అభినందనలు తెలిపారు. శాంతి, సౌమరస్యం, ఆధ్యాత్మికతను హార్ట్‌ఫుల్‌నెస్ ప్రోత్సహిస్తోందని, అందరూ ధ్యానం చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
భావోద్వేగాలను అదుపులోఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోందని, ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని, మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యానం దినోత్సవంగా యూఎన్ఓ ప్రకటించిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని, భారతదేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రమని, వికసిత్ భారత్-247 లక్ష్యంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని ఉపరాష్ట్రపతి తెలిపారు. వికసిత్ భారత్ లో ఆర్థికాభివృద్ధే కాదు.. దేశ శాంతి భాగంగా ఉంటుందన్నారు.