21-12-2025 12:52:25 PM
వెంకటాపూర్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ ఏర్పాటు అయ్యి 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లకు హన్మకొండలోని బాలసముద్రంలో గల కాళోజి కళాక్షేత్రంలో శనివారం సన్మానం నిర్వహించారు. వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మోడం శ్రీనివాస్ మహావీర్ ఫోటో స్టూడియో, దేశిని మహేందర్ గౌడ్ శ్రీరామ ఫోటో స్టూడియో, లక్ష్మీదేవి పేటకు చెందిన బీరెల్లి రమేష్ రవిరాజా ఫోటో స్టూడియోల వారిని ఫోటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి, అసోసియేషన్ కమిటీ సభ్యులచే శాలువాలతో సత్కరించి మేమంటూ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్ల సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేశామని రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వారు అన్నారు. ఫోటోగ్రఫీ సంఘంలో సుమారు 20 సంవత్సరాల క్రింద చేరి సంఘంలో ఎనలేని సేవలు చేసినందుకుగాను ఈ సత్కారం మాకు లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులతోపాటు వెంకటాపూర్ మండల ఫోటోగ్రాఫర్లు రామప్ప ఫోటోగ్రాఫర్లు అభినందించారు.