8 April, 2026 | 11:23 PM

మూడు రోజులకు బయటపడిన శవం...

07-02-2025 06:22 PM

గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖని జవహర్ నగర్ లో గల భారత్ యూత్ సమీపంలో ఓ ఇంట్లో మూడు రోజుల తర్వాత శవం బయటపడింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లి మూడు రోజుల కిందట ఊరికి వెళ్ళగా, శుక్రవారం ఇంటికి వచ్చి తలుపులు తీయగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లి చూడగా నేలపైన పరుపుపై కొడుకు శవమై ఉన్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు, ఆత్మహత్య చేసుకున్నాడ..? లేక మరి ఏమైనా జరిగి ఉంటుందా? కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడు రోజులుగా ఓ ఇంట్లో శవం ఉందన్న సంఘటన బయటకు రావడంతో చుట్టుపక్కల వారు భయకంపితులయ్యారు.