8 April, 2026 | 11:55 PM

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన పోచారం

08-04-2026 09:44 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా సమీపంలో గిర్మయ్య కాంప్లెక్స్ వద్ద బుధవారం కీ.శే. నాగులగామ గిర్మయ్య గుప్త జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగులగామ వెంకన్న గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు వేసవి తాపం నుండి ఉపశమనం కోసం అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అంబలిని పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అంబలి తాగడం చాలా ఆరోగ్యకరమని ఆయన అన్నారు.

ఇది మన సంప్రదాయ పానీయమని, అంబలి తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది ఎండ వేడి వల్ల వచ్చే అలసట తగ్గుతుందని ఆయన అన్నారు. గత ఎన్నో ఏళ్లుగా నాగులగామ  గిర్మయ్య జ్ఞాపకార్థం అతని కుమారుడు నాగులగామ వెంకన్న గుప్త తాడుకోల్ చౌరస్తా సమీపంలోని గిర్మయ్య కాంప్లెక్స్ వద్ద అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తూ వస్తున్నారన్నారు.  పాదాచారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి ఈ అంబలి కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  వేసవిలో ఎంతో ఉపశమనం కలుగుతుందని గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యను తగ్గిస్తుందన్నారు.