9 April, 2026 | 12:03 AM

గొర్రెలు, కోళ్ల దొంగతనానికి పాల్పడిన నలుగురు యువకుల అరెస్ట్

08-04-2026 09:56 PM

వివరాలు తెలిపిన ఎస్సై చంద్రకుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనుకుల గ్రామానికి చెందిన నలుగురు యువకులు జల్సాలకు అలవాటు పడి గత వారం రోజులుగా సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో గొర్రెలు మరియు  కోళ్లు దొంగతనాలు చేస్తున్న నలుగురు యువకులను బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తేదీ 31.03.25 రోజున రాత్రి సమయంలో సుద్దాల గ్రామానికి చెందిన ఒజ్జె  రాములుకి సంబంధించిన ఐదు గొర్రెలు,

అదేవిధంగా 06.04.26 రోజున రాత్రి సమయంలో చిన్న బొంకూర్ గ్రామంలో  కల్వల లక్ష్మారెడ్డి, మిగతా ముగ్గురు రైతుల దగ్గర దాదాపు 20 కోళ్లు  దొంగతనం చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేసి కనుకుల గ్రామానికి చెందిన నలుగురు యువకుల ను, ఒక మైనర్ అబ్బాయి నీ అదుపులోకి తీసుకొని వారిని అరెస్టు చేయడం జరిగింది అని, వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించినటువంటి ఎర్టిగా వెహికల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు.