9 April, 2026 | 12:04 AM

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

08-04-2026 09:53 PM

మాజి జడ్పీటీసీ మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట,(విజయ క్రాంతి): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు తక్షణమే మంజూరు చేయాలని మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అధికారి పి.డి.విజయ్ పాల్ రెడ్డిని ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... ఆత్మకూరు, బొల్లారం, జలాల్పూర్, జక్తి జాంకంపల్లి గ్రామాల్లో అనేక మంది పేదలు ఇప్పటికీ గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు.అర్హులైన పేద కుటుంబాలకు ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన మంజూరు చేసి,వారి సొంతింటి కలను నెరవేర్చాలని అధికారులను కోరారు.పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.