పక్కా హైదరాబాద్ సినిమా.. అమీర్ లోగ్
కొత్త నిర్మాణ సంస్థ అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్‌రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణరెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవిరెడ్డి సోమ నిర్మాత కాగా, మనోహర్‌రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
ముగ్గురు స్నేహతుల చుట్టూ తిరిగే ఓ వినోదాత్మక కథ ఇది. పోస్టర్‌లో చార్మినార్, ఇరానీ చాయ్ అని రాసి ఉన్న బోర్డును చూస్తుంటే ఈ స్టోరీ అంతా హైదరాబాద్ నేపథ్యంలో సాగనున్నట్టు అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌వీకే సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.




