16 April, 2026 | 2:00 AM

కే -ర్యాంప్.. కంప్లీట్ ఎంటర్‌టైనర్

12-10-2025 01:15 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘కే ర్యాంప్’. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో హీరో కిరణ్ మాట్లాడుతూ.. “కే ర్యాంప్’ కంప్లీట్ ఎంటర్‌టైనర్.

సందర్భాన్ని బట్టి ఫ్రస్టేషన్‌తో ఇప్పటి జనరేషన్ ఎలా మాట్లాడతారో నేనూ అలాగే మాట్లాడుతా. ఆ డైలాగ్స్‌తో ఎవరికీ ఇబ్బంది ఉండదు” అన్నారు. ‘సినిమా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు.

నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ.. “ఈ దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు హిట్ కావాలి. అందులో మన తెలుగు హీరో కిరణ్ చేసిన ‘కే -ర్యాంప్’ ఒక మెట్టుపైనే ఉండాలి” అన్నారు. నటుడు వీకే నరేశ్, డైలాగ్ రైటర్ రవి, డీవోపీ సతీశ్‌రెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.