- టీటీలో క్వార్టర్స్‌కే పరిమితం
- షూటింగ్, సైక్లింగ్, పారా లిఫ్టింగ్‌లో ఓటములు
పారిస్: టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ (టీటీ క్లాస్ 4) విభాగంలో రజతంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ పారిస్‌లో మాత్రం నిరాశపరిచింది. బుధవారం టీటీ మహిళల సింగిల్స్ క్లాస్ క్వార్టర్స్‌లో భవీనా పరాజయం చవిచూసింది. భవీనా 1 (12 11 8 11 తేడాతో యింగ్ జో (చైనా) చేతిలో ఓటమి పాలైంది. మరో సింగిల్స్ ప్లేయర్ సోనాబెన్ పటేల్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది.
ఇక పారా సైక్లింగ్ టైమ్ ట్రయల్‌లో అర్షద్ షేక్, జ్యోతి గడేరియా మరోసారి నిరాశపరిచారు. పురుషుల రోడ్ సైక్లింగ్ సీ టైమ్ ట్రయల్‌లో షేక్ అర్షద్ (25 నిమిషాల 20.11 సెకన్లతో) ఆఖరి స్థానంలో నిలవగా.. మహిళల సీ టైమ్ ట్రయల్‌లో గమ్యాన్ని (30 నిమిషాల 0.16 సెకన్లలో) పూర్తి చేసిన గడేరియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది.
షూటింగ్ మిక్స్‌డ్ 50 మీ పిస్టల్ (ఎస్‌హెచ్ 1) క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పారా షూటర్లు నిహాల్ సింగ్ (522 పాయింట్లు), రుద్రాంక్ష్ (517 పాయింట్లు) వరుసగా 19, 22వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. పారా లిఫ్టింగ్ ఈవెంట్‌లోనూ నిరాశే ఎదురైంది. పారాలిఫ్టింగ్‌లో పురుషుల 49 కేజీల విభాగంలో పరమ్‌జీత్ కుమార్, మహిళల 45 కేజీల విభాగంలో సకినా కాతున్ నిరాశపరిచారు. మహిళల షాట్‌పుట్ ఎఫ్ 46 ఫైనల్లో అమీషా రావత్ 9.25 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది.