14 April, 2026 | 1:35 PM

నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రమంతా వ్యాపించాలి

28-02-2026 12:07 AM

తెలంగాణ భవన్ లో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లకు సన్మాన సభ కార్యక్రమం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

అలంపూర్ ఫిబ్రవరి 27: రాష్ట్రంలో కాం గ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నడిగడ్డ ప్రాం తంలో ప్రజల విశ్వాసం , మద్దతు ఇప్పటికి బీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందని ఈ నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్, అయిజ బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన చైర్మన్ లకు కౌన్సిలర్ల అభినందన సభను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరా మిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు.అనంతరం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను ఆయన శాలువ కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి,సంక్షేమం జోడెద్దుల్ల ముందుకు సా గితే .. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అవినీతి ,అరాచక జోడేద్డులా మారాయని విమ ర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.

రైతుబంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను పూర్తిగా నిరాశపరిచిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.మళ్లీ కెసిఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ,అ యిజ మున్సిపల్ చైర్మన్ లు పిండి జయరాములు, సీఎం సురేష్, వైస్ చైర్మన్లు మాల నరసింహులు, ఎరుకలి విక్రమ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చల్లా 

అలంపూర్ ప్రాంత ప్రజల మీద, రైతాంగం మీద ప్రాంత అభివృద్ధి కొరకు యాడికైనా వెళ్లి పని చేసుకుని వచ్చే తత్వం మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు చల్లా వెంకట్రామిరెడ్డి అని కేటీఆర్ కొనియాడారు.