7 August, 2026 | 5:10 PM

స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

26-05-2024 03:09 AM

పటాన్‌చెరు, మే 25 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని స్క్రాప్ గోదాంలో శని వారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. చూస్తుండగానే గోదాంలోని సామగ్రికి మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. స్క్రాప్ గోదాంకు ఆనుకొని ఉన్న పరిశ్రమల నుంచి సిబ్బంది, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను నిలిపేశారు. పారిశ్రామికవాడలోని హెటీరో పరిశ్రమకు చెందిన ఫైర్ ఇంజన్, నర్సాపూర్ అగ్నిమాపక కేంద్రం నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపుచేసుందుకు శ్రమించాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరుగలేదని, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తిగా మంటలు అదపులోకి రావడంతో పరిశ్రమ యజామాన్యాలు, సిబ్బంది, కార్మి కులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి గుమ్మడిదల పోలీసులు, ప్రజాప్రతినిధులు, మండల నా యకులు వచ్చి పర్యవేక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరారు.