సిద్దిపేటలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగ
సిద్దిపేటరూరల్, మే 25 (విజయక్రాంతి) : రాత్రివేళ ఇండ్లల్లో వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగ సిద్దిపేట టూటౌన్ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. పోలీసులు మీడియాకు వివరాలు వెళ్లడించారు. సిద్దిపేట సీపీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో ఉదయం 11గంటలకు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నిందితుడు హైదరాబాదు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న స్కూటీ (టీఎస్01ఈపి 3252) ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంబడించి పట్టుకోని డిక్కీ తెరిచి చూడగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కనిపించాయి. ఎక్కడివని విచారించగా అసలు విషయం చెప్పాడు.
ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారని అడుగగా సిద్దిపేట టూటౌన్ పరిధిలో 1, త్రీ టౌన్ పరిధిలో 3, చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కరీంనగర్ జిల్లా పరిధిలో 13, ఆదిలాబాబ్ జిల్లాలో 1, ఆసిఫాబాద్ జిల్లాలో 1, సుల్తానాబాద్‌లో 1 చొప్పున మొత్తం 24 దొంగతనలు చేసినట్టు ఒప్పుకున్నాడు. దొంగతనాలు చేయ డానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకొని నేరస్తున్ని అరెస్టు చేసి జ్యూడిషియ ల్ డిమాండ్‌కు టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ పంపిచారు. నేరస్థుడు టేకం రామరావు అలియాస్ ఉమేశ్ తండ్రి ఆనంద్‌రావు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం వంతెనపల్లి గ్రామంగా గుర్తించారు. నివాసం ఇంద్రవెల్లి రాంనగర్‌గా పేర్కొన్నారు.
ఈ నేరస్తుడు గతంలో కూడా పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. నేరస్తుని నుంచి 47.70తులాల బంగారు ఆభరణా లు, 65 తులాల వెండి ఆభరణాలు, రూ. 34500 నగదు రికవరి చేసినట్టు తెలిపారు. నేరస్తున్ని చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ ఇన్స్‌స్పెక్టర్ ఉపేందర్, ఎస్సై వెంకట్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రవీందర్, ప్రశాంత్‌రెడ్డి, బాబు, లింగం, శ్రీకాంత్, రమేశ్‌ను సీపీ డాక్టర్ అనురాధ అభినందించి రివార్డు అందజేశారు.






