మెదక్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
గజ్వేల్, మే 25 : మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని కాంగ్రె స్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నా రు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మం డలంలో గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం డీసీసీ అధ్యక్షుడు తూం కుంట నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతివాడకు అభివృద్ధి లక్ష్యంతో పాలనను కొనసాగిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని, మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్థానిక సంస్థల్లో సైతం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశవాహులు ప్రజల మద్ధతు చూరగొనేలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మామిడాల శ్రీనివాస్, నర్సింహరెడ్డి, సలీం, కృష్ణారెడ్డి, గాడిపల్లి భాస్కర్, మామిండ్ల కృష్ణ, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






