8 March, 2026 | 12:04 AM

వరద రహిత హైదరాబాదే లక్ష్యం

21-10-2024 12:36 AM

జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజర్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్  20 (విజయక్రాంతి) : వరద రహిత హైదరాబాద్ కోసం అందరూ కృషి చేయాలని జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(జేఎంఐ) ఆర్గనైజర్స్ ఆకర్ష్ శ్రీరామోజు, గౌతం రాగి, నరేందర్ కలాల్ అన్నారు. జేఎంఐ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌లో వరదలు ప్రభుత్వం, పౌరుల పాత్ర’ అనే అంశంపై బంజారాహిల్స్ లమాకాన్‌లో ప్రభుత్వాధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.

కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. వరద నివారణలో ప్రభుత్వ సంస్థలు, ప్రజలు ఎలాంటి పాత్ర పోషించాలో వివరించారు. నివారణ చర్యలు తీసుకోకపోతే నగరంలో 2020 ఏడాది వచ్చినటువంటి వరదలు మరలా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎంఐ ప్రతినిధులు.. ఐలేష్, బాలకృష్ణ, రేణుశ్రీ, రేణుక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.