4 June, 2026 | 6:32 PM

విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

04-06-2026 05:49 PM

ములకలపల్లి,జూన్ 4 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని పలు విత్తన దుకాణాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబురావు,మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. విత్తన దుకాణలలో ఉన్న వరి,పత్తి విత్తనాలకు సంబందించిన స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్ లు,సోర్స్ సర్టిఫికెట్లు తనిఖీ చేసారు.డీలర్స్ అందరు తప్పకుండ స్టాక్ రిజిస్టర్లు, సోర్స్ సర్టిఫికెట్లు, స్టాక్ బోర్డులు నిర్వహించాలని  తెలియజేసారు.

కొనుగోలు చేసిన రైతులకి డీలర్లు తప్పనిసరిగా బిల్లులు జారీ చేయాలని సూచించారు.ఎవరైనా డీలర్లు నియమ నిబంధనలను అతిక్రమించినట్లయితే విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు విత్తనాలను ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన అధికృత విత్తన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని,విధిగా బిల్లులు తీసుకోవాలని కోరారు.రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలను వేసుకోకూడదని అలా వేసినట్లయితే విత్తనం యొక్క మొలకశాతం తక్కువుగా రావడం జరిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. వర్షపాతం 60-70 మిలిమిటర్లు పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలని సూచించారు.

గ్రామాలలో ఎవరైనా లూజు విత్తనాలు గాని లేబుల్ లేకుండ గాని అమ్మినట్లుతే వాటిని కొనుగోలు చేయరాదని, వెంటనే వ్యవసాయ మరియు పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.అదేవిధంగా గ్లైపోసెట్  నిషేధిత బిజీ -3 పత్తి విత్తనాలను రైతులు కొనుగోలు చేయకూడదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.