పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత
పోలీసుల పనితనానికి బాధితుల కృతజ్ఞతలు
పాపన్నపేట,జూన్4: సెల్‌ఫోన్లు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులకు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ గురువారం రికవరీ చేసిన 10 సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్‌లో 544 మంది బాధితులకు సెల్ ఫోన్లు అదజేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టి సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో మొత్తం 553 ట్రెసాబులిటీ చేసి 544 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు, రికవరీ చేసిన చరవాణులను సంబంధిత బాధితులకు దశలవారీగా అప్పగిస్తున్నామని తెలిపారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సీఈఐఆర్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. రికవరీ చేసిన తమ సెల్‌ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసుల సేవలను అభినందిస్తూ, ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.






