నవోదయలో మెరిసిన పేదింటి కుసుమం
ధర్మపురి,మార్చి29(విజయక్రాంతి): నవోదయ ఫలితాల్లో పేదింటి కుసుమం సత్తా చాటింది. వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన కుశనపెల్లి సతీష్ వజ్ర ల కుమార్తే కుశనపెల్లి వర్షిత చొప్పదండిలోని నవోదయ లో సీటు సాధించింది.ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విద్యార్థిని అభినందించి శాలువతో సన్మానించి అభినందించారు.
విద్యార్థి సీటు సాధించేందుకు కృషి చేసిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి శ్రీచైతన్య పాఠశాల ఉన్నత పాఠశాలగా మారుతుంది కాబట్టి ఉపాధ్యాయులు అందరూ మరింత కష్టపడి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు పాఠశాల కరస్పాండెంట్ సతీష్ పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, రాజేష్, వనజ, ఆండాళ్, రజిత, కళ్యాణి, సంధ్య, మల్లీశ్వరి, రజిత, అంజలి, నవ్య, అనూష, కార్తిక, స్వప్న, సువర్ణ, శిరీష, అనిత విద్యార్థిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




