28 July, 2026 | 1:11 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

చెపాక్‌లో చెన్ను దిగ్గజాల సందడి

23-03-2026 01:09 AM
  1. ఫ్యాన్స్ కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్

అలరించిన ఏఆర్ రెహమాన్ కన్సర్ట్

చెన్నై , మార్చి 22 : ఐపీఎల్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుండ గా.. ఫ్యాన్స్ హంగామా మాత్రం అప్పుడే మొదలైంది. అన్ని జట్లు తమ  అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహిస్తూ సందడి చేస్తున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ చెపాక్ స్టేడియంలో ఫ్యాన్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. రోర్ 2026 పేరుతో సాగిన ఈ ఈవెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాళ్లందరూ సందడి చేశారు.

ధోనీ కెప్టెన్సీలో ఆడిన సురేష్ రైనా, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, అంబటి రాయుుడు, బద్రీనాథ్, మైక్ హస్సీ, హెడెన్, బ్రేవో వంటి మాడీ ప్లేయర్స్ అందరూ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి అభిమానులను అలరించారు. తమ అభిమానల క్రికెటర్లందరూ మ్యాచ్ ఆడుతుండడంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ధోనీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే మారుమోగిపోయింది. కొత్తగా చెన్నై జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ పేరు కూడా స్టేడియంలో మోత మోగింది. అభిమానులకు అ భివాదం చేస్తూ స్టేడియం అంతటా తిరిగిన ధోనీ, ఇతర చెన్నై క్రికెటర్లు వారికి జెర్సీలు బహుమతులుగా అందజేశారు.

సీఎస్కే మాజీ క్రికెటర్లందరూ భారీ షాట్లతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. చెన్నై గెలిచిన ఐదు ట్రోఫీలను స్టేడియంలోకి తీసుకొచ్చి ప్రదర్శించారు. కాగా గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్ లో చెన్నై తన తొలి మ్యాచ్ ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.