23 March, 2026 | 4:35 AM

రాజసం చూపేనా?

23-03-2026 01:14 AM

అది ఐపీఎల్ తొలి సీజన్... అందరికీ లీగ్ కొత్తే.. అభిమానులకు సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్న మిగిలిన జట్లను నిలువరించి షేన్‌వార్న్ సారథ్యంలో ఛాంపియన్ గా నిలిచింది. కట్ చేస్తే 17 ఏళ్లుగా రెండో టైటిల్ కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సీజ న్లు మారుతున్నా రాయల్స్ మాత్రం మరోసారి ట్రోఫీ ముద్దాడలేకపోయింది. సంజూ శాం సన్ జట్టును వీడిపోగా, ఇప్పుడు రియాన్ పరాగ్ కెప్టెన్సీలోనైనా రాజసం చూపిస్తుందా ?

  1. రెండో టైటిల్ కోసం రాజస్థాన్ నిరీక్షణ
  2. తొలి సీజన్‌లోసంచలన ప్రదర్శన
  3. 2022లో రన్నరప్‌గా రాయల్స్
  4. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు

జైపూర్, మార్చి 22 : ఐపీఎల్ ఆ రంభ సీజన్‌లోనే సంచలన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకర్షించిన జట్టు రాజస్థాన్ రాయల్స్... ఒకరిద్దరు తప్పి స్తే మిగిలిన వారంతా అనామకులే.. అలాంటి యువ బలంతోనే 2008లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. సంచలన విజయాలతో ఏకంగా ఛాం పియన్‌గా నిలిచింది. కానీ తర్వాతి సీజన్లలో మాత్రం నిరాశపరుస్తూ వస్తోంది. ఆ తర్వాత జరిగిన 17 సీజన్లలో కేవలం మూ డుసార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ వరకూ వచ్చిన రాయల్స్ 2022లో ఫైనల్ దాకా వెళ్లినప్పటికీ టైటిల్ అందుకోలేకపోయింది.

గత ఏ డాది అత్యంత చెత్త ప్రదర్శనతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో సం జూ శాంసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవ డం, కెప్టెన్సీ మార్పు వంటి ప్రభావం చూపించాయి. 2025 సీజన్ ముగిసిన తర్వాత కోచ్ గా రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. సంజూ శాంసన్‌ను ట్రేడింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చేసిన రాజస్థాన్ రాయల్స్ బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను తీసుకుం ది.

ఇప్పుడు ద్రావిడ్ స్థానంలో కుమార సం గక్కర కోచ్‌గా, సంజూ శాంసన్ ప్లేస్‌లో రి యాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నారు. రాయల్స్ బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వా ల్ మెరుపు ఆరంభాల తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు ఖాయం. యు వ సంచలనం వైభవ్ సూర్యవంశీ గత సీజన్‌లో ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆ డాడో అందరూ చూ సారు. దీంతో మరోసా రి ఈ చిచ్చరపిడుగుపైనే అందరి దృష్టి ఉంది. అటు రియాన్ పరాగ్ గత సీజన్‌లో ఫ్లాప్ అయ్యాడు. ఈ సారి కెప్టెన్సీ ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో ఎలా రాణిస్తాడో చూడాలి.

జురెల్ కూడా రాజస్థాన్ బ్యాటింగ్‌కు బలం. అలాగే హిట్ మెయిర్, లువాన్ ప్రిటోరియస్ వంటి ప్లేయర్లతో మరింత పటిష్టంగా కనిపిస్తోంది. హిట్ మెయిర్ విధ్వంసా లను ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు చూసారు. ఈ విండీస్ హిట్టరే రాయల్స్‌కు ఫినిషర్ కానున్నాడు. అతనితో పాటు జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాపైనా అంచనాలున్నాయి. అటు సామ్ కరన్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోవడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పొ చ్చు.

ప్రస్తుతం అతని స్థానంలో శ్రీలం క క్రికెటర్ దషున్ శనకను తీసుకునే అవకాశముం ది. మరోవైపు బౌలింగ్ విభాగంలో కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి. గత సీజన్ లో నిరాశపరిచిన జోఫ్రా ఆర్చర్ ఈ సారి ఎంతవరకూ రాణిస్తాడనేది ఆసక్తికరం గా మారింది. మిల్నే, బర్గర్, మఫాకా లాంటి విదేశీ బౌలర్లు ఉన్నా ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి.

అటు సందీప్ శర్మకు తోడుగా ప్రభావం చూపించే భారత పేసర్ లేకపోవడం రాయల్స్‌కు ఇబ్బందే. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్‌పైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. కెప్టెన్ పరాగ్ తన స్లో బౌలింగ్ తో వికెట్లు తీయగలిగితే రాజస్థాన్‌కు అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తం మీద పరాగ్ యువ నాయకత్వం, కుమార సంగక్కరా కోచింగ్ అనుభనం రాజస్థాన్ రాయ ల్స్‌కు టైటిల్ అందించగలదో లేదో వేచి చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు

జైస్వాల్, హిట్ మెయిర్, వైభవ్ సూర్యవంశీ, శుభ్మ్ దూబే, డ్రీ ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, సా మ్ కరణ్, డీ ఫెర్రెరియా, జోఫ్రా ఆర్చర్, తు షార్ దేశ్పాండే, సందీప్ శర్మ, యుధ్వీర్ శర్మ, క్వేన్ మఫకా, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, విఘ్నే ష్ పుత్తూరు , రవి సింగ్, అమన్ రావు, బ్రిజే ష్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్